Monday, October 24, 2011

ప్రేమాంతరంగం - ఒంటరి ప్రవాహాల


ఎప్పుడూ
పరస్పర సన్నిధికోసం
ఒకరికొకరు పరితపిస్తూ
దేహపు రేకల్ని విప్పటానికి
ఏ చికట్లోనో పెనవేసుకుంటూ
మాటలకోసం
మగత మగతగా కళ్ళుతెరిస్తే
నా ప్రక్కన నీవుండవు
ని ప్రక్కన  నేనుండను


నేత్రాలను ఆత్రాలు చెయ్యబొతూ
చటుక్కున రింగుటోన్లైపోతుంటే
రాత్రి తీరని సలుపేదో
ఇంకా మూల్గుతూ  వేధిస్తుంది

ఎవ్వరు సడిచెయ్యని
ఏకాంతంలోకి
మనం పారిపోవాలనుకుంటాం
ఏమూలదాక్కున్నా
వెతికే డాలర్ కన్ను
బందీల్నిచేసి
మరిన్ని రింగుటోన్లి
బహుమతిగానే తీసుకుంటూనే

వేళ్ళూనిన సాంప్రదాయాల్ని
దాటాల్సినప్పుడు
భద్రంగా దాచుకున్న
సంప్రదాయాల్ని కూలుస్తున్నట్టు

నిలదీసే చూపుతో
కుటుంబం సమాజాల మధ్య
విసరే వడగాల్పుల్లో
నేరస్తుల్లా
చెయ్యరానిదేదో చేసినట్టు

 స్వేచ్చకోసం నలిగి
పోరాడి
సరికొత్త నిర్వచనాలు
ఆవిష్కరిస్తూ
స్వప్నాన్ని వాస్తవీకరిస్తూ

ఎదురయ్యే సమస్యల
యుద్ధాన్నో
యుద్ధతంత్రాన్నో
ఎదుర్కొంటూ
ఒంటరి ప్రవాహాల ఈదులాటలో
ప్రేమజంటలు

4 comments:

  1. సామాజిక సంక్షోభం మధ్య నలిగిపోతున్న వ్యక్తిగత ఆనందాలు, కుటుంబాలలోని వైరుధ్యాల మూలాన్ని చెప్తూ వీటికి కారణమైన పెద్దన్న పాత్రను ఎండగడుతూ కొత్తగా చెప్పినందుకు శుభాబినందనలు సార్....

    ReplyDelete