Wednesday, July 21, 2010

ప్రేమ గెలుపు

ప్రేమ గెలుపు


ఇరువు ఒక్కటవ్వటమేనని

జీవన భాగస్వామ్యానికి

ఎవరికివారే పరిథులు గీసుకుంటూ

ఎవరికివారే నిర్వచించుకుంటూ

నిరంతరవలయాలలో చిక్కుకుంటూ

తరంనుంచి తరానికి

వారధులేవో నిర్మిస్తూనో

అగాథాల్ని సృష్టిస్తూనో

తరంగమై ఎగసిపడే జంటలకు

ఒక్కసారి ఆలింగనమయ్యాక

ఈదవసిందే!

పయనించాల్సిందే!



పట్టుదొరికితే ప్రతి అడుగూ


కొలంబస్ మోపిన పాదమే అవుతుంది


టెన్సింగ్ నార్కే ఎగరేసిన జెండా అవుతుంది

Wednesday, July 7, 2010

ఎవరినైనా ప్రేమించాలి

ఎవరినైనా ప్రేమించాలి

అచేతనపు బీడుల్లో

వొంటరితనాన్ని ఈదుకుంటూ

చేతనాలింగన

ఎదురుచూపుల కోసం

ఎడారి ఇసుకల్లోంచి

జారిపోయిన వసంతాలు

వెదలేని కన్నుల్లో

ఖర్జూరపు తీపికోసం

ప్రవాహ తీరాలకోసం

***

ఎవర్ని ప్రేమించాలి?

ఎప్పుడు ప్రేమించాలి?

ఎలా ప్రేమించాలి?


వ్యక్తపరచలేని ప్రేమభావం

విచ్చుకోని మొగ్గౌతుంది

చూపులు కలిసిన శుభఘడియేదో

ఆత్మలను కలుపుతుంది

గాలి చొరబడని కౌగిలింతేదో

బందీల్ని చేస్తుంది

***


పరిమళించిన పథాలలో

నడిచారో, పరుగెత్తారో, అలసిపోయారో

స్విచ్ వేయగానే గిర్రున తిరిగే ఫేనులా

కాలమేమి తిరగదు

ఒకరికొకరుగా ప్రీతిచేయడానికి

మనకు మనంగా శృతిచేయడానికి

మధ్య మధ్య ప్రవేశిస్తూనే వుంటుంది

వడిసి పట్టుకోవడం

మెలిపెట్టడం

సహనాన్నో బందాన్నో పరీక్షించడం

నడిపించడం పరుగులెత్తించడం

ఏడ్పించడం నవ్వించడం

దూరం చేయడం దగ్గరవ్వడం

కళ్ళలో కలలు నింపడం

దానికి వెన్నతో పెట్టిన విద్య

ఎవర్ని గెలిపిస్తుందో

ఎవర్ని ఓడిస్తుందో

బహుశ

తను అలసినప్పుడు

మరో జంటను వెతుకుతుంది

దాని వెతకడం ఆ జంట వంతౌతుంది.

Saturday, June 26, 2010

ప్రేమాంతరంగం


అప్పుడప్పుడూ
చూపులు పాకుతుంటాయి
లోతుల్లోకో లోపాలలోకో

అప్పుడప్పుడూ
చూపులు వెదకుతుంటాయి
ఆదమర్చిన  యదపైకి

అప్పుడప్పుడూ
చూపులు వెంటాడుతాయి
వదిలేసిన పాదాల అడుగులతోటి
చూపులు గమనిస్తుంటాయి
కప్పుకున్న వస్త్రం వెనుక దాగిన రహస్యాన్ని
బట్టబయలుకాని దానికోసం
రహస్య అన్వేషణ సాగుతుంది


కళ్ళెదుట కన్పించే  రంగు
కంటిని కవ్విస్తుంది

అలంకారాలన్నీ
అందాలుగానే కన్పిస్తాయి

పులకరింత రేపిన వయసు
కవ్వించే సొగసు
కలిసి
కేరింతలు వేస్తుంది మనసు

నిదురేరాని రాత్రులన్నీ
పులకింతల పున్నమిలౌతాయి
--------
photo courtesy : flicker.com

Monday, June 14, 2010

దానిపేరు ప్రేమైతే

కాలం గుప్పెట్లో చిక్కిన
రెండుహృదయాల మధ్య జరిగే నిరంతర ప్రవాహం

కాలానికి వయసులేనట్టే
ప్రవాహానికీ వయసులేదు

ప్రవాహం ఎక్కడపుడుతుందో
ఎక్కడికో తెలియని నిరంతర ప్రయాణం
సాగిస్తూ కొనసాగిస్తూ
ప్రవహించే చోటుల్లో పచ్చదనాన్ని నింపుతూనే వుంటుంది

దానిపేరు ప్రేమైతే
పచ్చదనం ఎవరెవరిని అంటుకుంటుందో కదా!

నువ్వు

ఎదెరురెదురు పడని
ఉదయ సాయంకాలలో
ఎదో ఒక క్షణం
ఎదురుపడే జ్ఞాపకం నువ్వు

Wednesday, June 9, 2010

ప్రేమతరంగం

ప్రేమతరంగం
ప్రేమను గూర్చిన
భావతంగాలు
అనుభూతులు
అనుభవాలు
ఇంకా..... అలా... అలా.. మరికొన్ని
వాటిమధ్య
ఆనందం
కొంచం కష్టం
కొంచం దుఃఖం 
జీవితం
జీవనం


ఒకరితో ఒకరు పంచుకుందాం