Saturday, October 22, 2011

ప్రేమాంతరంగం - జీవిత రహదార్లను వెదక్కుంటూ


భావాల కిటికీలు మూసి
బాధ్యతల ద్వారాలు తెరిచి
ఉరుకులు పరౌగుల
జీవిత రహదార్లను వెదక్కుంటూ
జీవన యాతనల్ని
నేర్చుకుంటున్నప్పుడు
 తేలికగానో
కష్టంగానో
కన్నీటితోనో
అనుభూతులను నేర్చుకుంటూ
ఆనందాలను నిర్మించుకుంటుంటే
ఊహల్లో కలలుకన్న లోకం
వాస్తవాన కానరాక
తికమకపడ్తున్నప్పుడు
బంధువులో
స్నేహితులో
పరిసరాలో
సాంస్కృతిక వర్గవిభేదమో
సూదులుగుచ్చే నాల్కలతో
హృద్యాంతరంగాన్ని
లోలోకి పిండుకుంటూ
ఎదురయ్యే
ఆర్థిక నిరంతర రణగొణల మధ్య
రహస్య సంకేతాలను
పదిలపర్చుకుంటూ
ప్రేమజంటలు

4 comments:

  1. మీరు నా గురించే రాసారా ఈ కవిత అన్నట్టు ఉందండి చదువుతుంటే....నన్ను నేను చదువుకున్నట్టు..

    ReplyDelete
  2. ప్రవీణ
    అలా వుండటమే జీవితపార్శం
    స్పందనకు ధన్యవాదాలు

    ReplyDelete
  3. Tana Kavitalo tamanu taamu andaroo vedukkonelaa vraayadame mee pratyekata John saab. abhinandanalu. Sreyobhilaashi ...NUTAKKI . (Kanakambaram.)

    ReplyDelete
  4. మీ కవితలో తమను తాము అందరూవెతుకులాడే లా వ్రాయడమే మీ ప్రత్యేకత జాన్ సాబ్ . అభినందనలు . శ్రేయోభిలాషి ...నూతక్కి . (కనకాంబరం .)

    ReplyDelete