ప్రేమ
దేన్ని ఇష్టపడుతుందో!
దేన్ని ప్రేమిస్తుందో!
రూపాన్నో!
లక్షణాల్నో!
స్థితిగతుల్నో!
శారీరక ఆకర్షణనో!
మేనిచాయ
మనసును మెరిపిస్తుంది
అంగ సౌష్టవం
కనులను కలవర పెడ్తుంది
వ్యాపార ప్రపంచం
వనరులన్నీ వొలకబోసి
ఆకర్షించి బ్రమింప చేస్తుంది
శరీర ఆత్మ సౌందర్యాల
ఆంతఃర్యమెరుగని
యౌవ్వన ప్రాయంలో
రేకులువిచ్చిన ప్రేమభావం
సన్మోహన పరిచే
సౌందర్యాన్ని వెదకుతుంది
***
మొలకెత్తే అంకురాల్ని
కనుగొన్న శాస్త్రవేత్తల్లా
చిగురుతొడిగే జీవితానికి
అదను పదునులేవో తెలుసుకున్నట్లు
నిశ్శబ్దాన్ని చీలుస్తూ
గుప్పెడు భావాలతో
హృదయాలు తరచుకుంటూ
భావాలను మార్చుకుంటూ
కలల కంటున్న లోకంలో
పాన్పులేవో పరచుకుంటూ
మాటలను గింజలుగా
జీవననారుమడులకోసం
చల్లుకుంటున్నట్లు
తపన ఉద్వేగం
కాలునిలువని కేరింత
వయసుకది కవ్వింత
తనువుకే గిలిగింత
సాధించినదేదో
మిగిలిపోయిందేదో
విజయగర్వం
పులుముకున్న దీప్తితో
శిఖరాల ఆధిపత్యపు
దారులు వెదక్కుంటూ
అలుపెరుగని
అనంత పయనాల కోలాహలం
పరవశ నయనాలతో
ప్రేమజంటలు
***
శరీర ఆత్మ సౌందర్యాల
ReplyDeleteఆంతఃర్యమెరుగని
యౌవ్వన ప్రాయంలో
రేకులువిచ్చిన ప్రేమభావం
సన్మోహన పరిచే
సౌందర్యాన్ని వెదకుతుంది.....vaastavam sir.Nutakki (Kanakambaram)
"..మాటలను గింజలుగా
ReplyDeleteజీవననారుమడులకోసం
చల్లుకుంటున్నట్లు.."
"..శిఖరాల ఆధిపత్యపు
దారులు వెదక్కుంటూ
అలుపెరుగని
అనంత పయనాల కోలాహలం.."
అద్భుతం మీ శైలి జాన్ గారు
నూతక్కి గారు స్పందనకు ధన్యవాదములు
ReplyDeleteJyoyhirmayi Prabhakar
ReplyDeleteశైలి ఏముందడీ ఇవి నా ఆలోచనలు, అనుభవాలు, పరిశీలనలు
ఈ కావ్యం గత ఏడు సంవత్సరాలుగా రాస్తూనే వున్నాను.
స్పందనకు ధన్యవాదములు
ప్రేమ ఔన్నత్యాన్ని చెప్తూనే సౌందర్య రహస్యాన్ని గ్రహింప జేస్తూ వ్యాపార సంస్కృతిని దుయ్యబట్టడం నచ్చింది సార్...
ReplyDeletea splendid poem blended with facts and thoughts....thank u john sir...for giving us such a good poem...love j
ReplyDeleteThanks for your compliment Dhaathriji
ReplyDelete"నిశ్శబ్దాన్ని చీలుస్తూ
ReplyDeleteగుప్పెడు భావాలతో
హృదయాలు తరచుకుంటూ
భావాలను మార్చుకుంటూ"
చాలా బావుంది.
జ్యోతిర్మయి
ReplyDeleteస్పందనకు ధన్యవాదములు