ప్రేమ తప్ప మరేదీ లేదంటూ
ఒంటరి జీవితాలు
జంటవుతున్న వేళ
కోయిలలై పడాలి
మరో వసంత గీతాన్ని
పురివిప్పి నాట్యమాడాలి
హృదయతరంగాల ప్రేమిక సంగీతాన్ని
తొలకరిజల్లుల పులకరింతల
హరివిల్లులై విరియాలి
తనువంతా తడిసిన వర్షంలో
తడిసి తడిసి ఆడాలి
* * *
ప్రేమ వ్యక్తిగతావసరమై
ప్రేమ పరస్పరావసరమై
ప్రేమ సామాజికావసరమై
జీవితమంతా అల్లుకుపొతుంది
ప్రేమ తపనతో
కుర్రతనం కొత్త పేర్లు వెదకుతుంది
కొత్త భాష్యం నేరుస్తుంది
పలికే ప్రయత్నంలో
మనసు మొరాయిస్తుంది
పదాలు లేక పదం తడబడుతుంది
ఉద్వేగ తన్నుకొస్తుంది
తూనిగల్లా పరుగులెత్తే పిల్లలు
గసతీరకముందే చెపాలనుకున్నదేదో
వగర్చుతూ చెబుతున్నట్లు
ఉద్వేగమైన అలల సవ్వడితో
దేహం తేలుతుంటే
కళ్ళలోంచో పెదవుల్లోంచో
ధ్వనించే గుండె చప్పుళ్ళు
తడిపొడి పెదవులు
ఆకలి తెలియని ఆరాటం
కునుకెరుగని ఎదురుచూపు
చందన మద్దిన పరిమళ మయం
రైలు ఇంజనులోని రాకాసిబొగ్గు
రగులుతున్న జ్వాలల్లో
తన్మయమో
తమకమో
తీరమెరుగని ఈదులాట
* * *
మాటలు ముడివేసి
ధ్యానంతో పూసలు లెక్కపెట్టినట్టు
పసిపిల్లలు పాలపీక చప్పరించినట్లు
పెదాలు కదుపుతూ
"'నేను నిన్ను ప్రేమిస్తున్నా"
అన్నంతనే తెరలేస్తుంది
అవుననగానే
శాంతమైన మనస్సు రెక్కలుచాపి
క్షణ క్షణ విహంగ వీక్షణం
అయస్కాంత క్షేత్రంలో రేఖల్లా
సంబంధలేవో
వొకదాని వెంటొకటి
అంతర్ముఖంగానో
బహిరంగానో వచ్చిపడతాయి
తరంగమేదో తడిపేస్తుంది
రెండు ముఖాలుగా చీలిన
గుమ్మాలకీ కిటికీలకూ
పరదాలు తగిలించబడతాయి
రెపరెపలాడుతున్న పరదాల్లోంచి
మొహానికి
రంగద్దటం మొదలౌతుంది
విజయగర్వమేదో
పొడచూపుతుంది
కొత్త విజయాలకు
పగ్గాలను వెదకుతుంది
***
***
The Way of arrangement of cards to express love is
ReplyDeletewonderful.prema vinyaasam chakkagaa visadeekarinchaaru.Abhinandanalu Haide Sab.Sreyobhilaashi ...Nutakki (kanaqkambaram )
Thank you Nutakkiji
ReplyDelete"Premantarangam" anna peru ee kavitha ki saardhaka naamadheyam..... chaalaa baagundi sir
ReplyDeleteexcellent expression john.....great flow of thought arranged well .....love j
ReplyDeleteThank you Shamili
ReplyDeleteThank you Jagathiji
ReplyDeleteఈ కవితలొ మీ పదవిన్యాసం మరోసారి అభినందనీయం. కవిత ఆసాంతం ప్రేమాంతరంగాన్ని ఆవిష్కరించింది.
ReplyDeleteమీ పదాలవెంబడి కనుగుడ్లు తిరిగినంత వేగంగా మీ భావాలవెంబడి ఆలోచనలూ తిరిగాయి. అనుభవించడమే కాదు అభినందించేంత స్థాయి నాకుంటే బాగుణ్ణనిపించిందొక్కసారి
ReplyDeleteవాసుదేవ్
ReplyDeleteపద విన్యాసం నాది కాదు ప్రేమదే
స్పందనకు ధన్యవాదములు
జ్యోతిర్మయి
ReplyDeleteస్థాయి లేదనుకోవడం కరక్టుకాదు
మికేమనిపించిందో అది చెప్పడానికి సంకోచింవద్దు.
అభినందించినందుకు ధన్యవాదాలు